Advertisementt

నందమూరి మోక్షజ్ఞ ట్రైనింగ్ ముచ్చట్లు

Wed 13th Nov 2024 11:27 AM
mokshagna  నందమూరి మోక్షజ్ఞ ట్రైనింగ్ ముచ్చట్లు
Nandamuri Mokshagna training charms నందమూరి మోక్షజ్ఞ ట్రైనింగ్ ముచ్చట్లు
Advertisement
Ads by CJ

నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారు కాలేదు. కానీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వివరాలు అఫీషియల్ గా వచ్చేసాయి. మోక్షజ్ఞ 2025 నుంచి సెట్స్ మీదకి వస్తాడు. ఈ ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే కి ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మూవీ ఫస్ట్ లుక్ తో ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు, సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజస్విని నిర్మాతలు. 

అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ముహూర్తం ఎప్పుడు, రెగ్యులర్ షూట్ కి ఎప్పుడు వెళతారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. డిసెంబర్ నుంచి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తో సెట్స్ మీదకి వస్తారనుకున్నారు. మరోపక్క మోక్షజ్ఞ వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర 8 నెలలుగా యాక్టింగ్ లో శిక్షణ పొందాడట. అక్కడ శిక్షణ పూర్తి కాగానే ఇపుడు ఆర్పీ పట్నాయక్ దగ్గర ట్రైన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. 

ఇప్పటికే మేకోవర్ విషయంలో అందరిని ఆశ్చర్యపరిచిన మోక్షజ్ఞ మొదటి సినిమాలో యాక్టింగ్ తోనూ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడానికి చాలా కష్టపడుతున్నట్లుగా ఈ న్యూస్ చూస్తే అర్ధమవుతుంది. ఒక అడుగు ఆలస్యమైనా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఎదురుండదు అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా అడ్జెస్ట్ అవుతున్నారు. 

Nandamuri Mokshagna training charms:

Balakrishna son Mokshagna takes acting training

Tags:   MOKSHAGNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ