Advertisementt

రాజా సాబ్ పై బాలీవుడ్ నిర్మాత హాట్ కామెంట్స్

Wed 13th Nov 2024 10:01 AM
prabhas  రాజా సాబ్ పై బాలీవుడ్ నిర్మాత హాట్ కామెంట్స్
Bollywood producer hot comments on Raja Saab రాజా సాబ్ పై బాలీవుడ్ నిర్మాత హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్రభాస్ రాజా సాబ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను భూమి మీద నిలువనియ్యడం లేదు. అసలే నిన్నటివరకు మారుతి పై గుర్రుగా ఉన్నారు, ఇప్పుడు అదే మారుతి తమ హీరో ప్రభాస్ రాజా సాబ్ విషయంలో ఇస్తున్న సర్ ప్రైజ్ లకు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊపిరి ఆడడం లేదు. 

రాజా సాబ్ మ్యూజిక్ రైట్స్ ని 25 కోట్లకి కొనేసిన భూషణ్ కుమార్ తాజాగా రాజా సాబ్ పై క్రేజీ కామెంట్స్ చేసారు. మేము రాజా సాబ్ ఆడియో ఆడియో రైట్స్ కొన్నాము, రాజా సాబ్ లోని కొన్ని సీన్స్, సాంగ్స్ విజువల్స్ చూసాము, అవి చూడగానే నాకైతే హాలీవుడ్ సూపర్ బ్లాక్ బస్టర్ హ్యారీ పోటర్ సినిమా వైబ్ కనిపించింది. 

ఈ చిత్రం ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ కొట్టడం ఖాయం అంటూ భూషణ్ కుమార్ రాజా సాబ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే రాజా సాబ్ నిర్మాత రాజా సాబ్ కథ చిన్నది కాదు, దీని బడ్జెట్ మీడియం కాదు అంటూ చెప్పిన మాటలు మరవకముందే మళ్ళీ ఇప్పుడు భూషణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచేసింది. 

Bollywood producer hot comments on Raja Saab:

Bollywood producer compares Prabhas The Raja Saab to Harry Potter

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ