Advertisementt

వారణాసి నుంచి మొదలెట్టనున్న మహేష్

Tue 12th Nov 2024 10:44 PM
mahesh  వారణాసి నుంచి మొదలెట్టనున్న మహేష్
Mahesh will start from Varanasi వారణాసి నుంచి మొదలెట్టనున్న మహేష్
Advertisement
Ads by CJ

రాజమౌళి-మహేష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే మొదలవుతుంది అని మహేష్ ఫ్యాన్స్ కూడా కామయ్యారు. లేదంటే సోషల్ మీడియాలో SSMB 29 పై రచ్చ రచ్చ చేసేవారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆత్రుత పడేకొద్దీ ఈచిత్రం అలా అలా లేట్ అవుతూనే ఉంది. రాజమౌళి, మహేష్ మూవీ కోసం స్క్రిప్ట్ చెక్కడమే కాదు ఈ చిత్రానికి సరిపోయే లొకేషన్స్ వేటలో తలమునకలై ఉన్నారు. 

మహేష్ కూడా రాజమౌళి పిలుపు కోసం మేకోవర్ అవుతూ.. జిమ్ లో కష్టపడుతున్నారు. అయితే రాజమౌళి-మహేష్ మూవీ కి సంబందించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అదేమిటంటే రాజమౌళి మహేష్ తో ముందుగా ఈ చిత్రాన్ని వారణాసి నుంచి మొదలు పెట్టబోతున్నారట. 

అందుకు వారణాసి వెళ్లకపోయినా.. హైదరాబాద్ శివార్లలో వారణాసి సెట్ రెడీ అవుతుంది అని.. అక్కడ మొదలైన కథ సౌత్ ఆఫ్రికా అడవులకు షిఫ్ట్ అయ్యి సినిమాలోని మేజర్ పార్ట్ చిత్రీకరణ అక్కడ అడవులలోనే ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలోని పలు లొకేషన్స్ ని చూసి రాజమౌళి లాక్ చేసుకున్నారు. 

ఇక SSMB 29 పొంగల్ తర్వాతే అంటే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లేలా రాజమౌళీ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్. 

Mahesh will start from Varanasi:

SSMB29 update 

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ