Advertisementt

జగన్ మీరు తప్పు చేస్తున్నారు..

Tue 12th Nov 2024 05:26 PM
jagan  జగన్ మీరు తప్పు చేస్తున్నారు..
Jagan you are doing wrong జగన్ మీరు తప్పు చేస్తున్నారు..
Advertisement
Ads by CJ

జగన్ మీరు తప్పు చేస్తున్నారు అనేది ఏ కూటమి ప్రభుత్వమో లేదంటే టీడీపీ వాళ్ళో అన్నది కాదు.. వైసీపీ కి కొమ్ము కాచే బ్లూ మీడియానే జగన్ మీరు తప్పు చేస్తున్నారు, దానిని సరిదిద్దుకోమని చెబుతుంది. కొన్నాళ్లుగా పదే పదే జగన్ ను మారమంటూ హెచ్చరిస్తూ వస్తున్న బ్లూ మీడియా మరోసారి జగన్ కి తన తప్పును ఎత్తి చూపిస్తుంది.

ఇంతకీ జగన్ కొత్త చేస్తున్న తప్పేమిటి అంటే ఆయన అసెంబ్లీ కి వెళ్లకుండా డుమ్మా కొట్టడమే ఆయన చేస్తున్న తప్పు కాదు, ఆయనతో పాటు వైసీపీ కి ఎన్నికైన 10 మంది ఎమ్యెల్యేలును ఆయన అసెంబ్లీ కి వెళ్లకుండా ఆపడమే ఆయన చేస్తున్న పెద్ద తప్పు. తనకి ప్రతిపక్ష హోదా కావాలని పోరాడడం తప్పు కాదు, కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం తప్పే.

మిమ్మల్ని మంచి చెయ్యడానికి ప్రజలు ఎన్నుకున్నారు, అధికారం పోయింది అయినా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవడం జగన్ ని తప్పుబట్టేలా చేసింది. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపించడం విడ్డురమే, అసెంబ్లీ లో ఎమ్యెల్యేగా కూర్చునేందుకు ఇబ్బంది పడి ప్రతిపక్ష నాయకుడి హోదా ను కోరుకోవడం కరెక్ట్.

కానీ కోర్టు తీర్పు వచ్చేవరకు తనలాగే మిగతా పదిమంది ఎమ్యెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లకుండా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్, మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని అప్పట్లో పవన్ కళ్యాణ్ ని అన్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు అదే అసెంబ్లీ కి వెళ్ళడానికి భయపడుతున్నాడంటూ నెటిజెన్స్ కూడా కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. 

Jagan you are doing wrong:

Media tells Jagan that you are doing it wrong and correct it

Tags:   JAGAN