ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం సోషలో మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్ట్ లు పెడుతున్న వైసీపీ కార్యకర్తలను, వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్టులని అరెస్ట్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసిందో ఆ వెంటనే శ్రీరెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. మరోపక్క వర్ర రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇంటూరి రవి కిరణ్ లను పోలీస్ లు అరెస్ట్ లు.
ఇంకోపక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లపై నీచమైన కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. వైసీపీ పార్టీ కోసం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి పై రాజమహేంద్రవరం జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ ప్రభుత్వ అండతో పోసాని పలుమార్లు జనసేనానితో పాటు పార్టీ కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా దూషించారని, కానీ అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. దాంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ఈ సందర్భంగా జనసేన నేతలు పోలీసులకు తెలియజేశారు. ఈ లెక్కన పోసానికి కూడా మూడినట్లే కనిపిస్తుంది.