పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిన్న దర్శకుడు మారుతి తో సినిమా చేస్తున్నారనగానే అందరిలో ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అంత పెద్ద స్టార్ అయ్యుండి చిన్న దర్శకుడు, డిజాస్టర్ దర్శకుడు మారుతి తో సినిమా అనగానే చాలామంది ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ మధ్యలో రిలాక్స్ అయ్యేందుకు డిఫ్రెంట్ గా ఈ సినిమా చేస్తున్నారనుకున్నారు.
రాజా సాబ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ లోని భయాలను మారుతి పోగొట్టాడు. రాజా సాబ్ గ్లిమ్ప్స్ తో ఫ్యాన్స్ ని కూల్ చెయ్యడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. అయితే రాజా సాబ్ చిన్న సినిమాగానే చాలామంది ట్రీట్ చేస్తున్నారు. మీడియం బడ్జెట్ తోనే మారుతి తో ప్రభాస్ సినిమా చేస్తున్నారనుకుంటున్నారు.
కానీ రాజా సాబ్ చిన్న చితక కథతో తెరకెక్కడం లేదు అని నిర్మాత మాటలు చూస్తే అర్ధమవుతోంది. రాజా సాబ్ గురించి నేను చాలా తక్కువగానే చెప్పగలను. రాజా సాబ్ స్థాయి వేరు. రెండేళ్ల ముందే మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ని కల్కి విడుదలయ్యాకే పెద్ద షెడ్యూల్ చేశాం. రాజా సాబ్ స్టోరీ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది.
సెట్స్, వీఎఫెక్స్ అన్నీ కూడా భారీగా ఉంటాయి. ఇదొక కామెడీ ఎంటర్టైనర్.. అంటూ రాజా సాబ్ రేంజ్ ఏమిటో నిర్మాత విశ్వప్రసాద్ మాటల్లో విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇక ఈ చిత్రం భారీగా అంటే 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా నిర్మాత మాటల్లో అర్ధమవుతుంది.