Advertisementt

ఇకపై నన్నలా పిలవొద్దు: కమల్ హాసన్

Mon 11th Nov 2024 05:58 PM
kamal haasan  ఇకపై నన్నలా పిలవొద్దు: కమల్ హాసన్
Kamal Haasan bids adieu to Ulaganayagan tag ఇకపై నన్నలా పిలవొద్దు: కమల్ హాసన్
Advertisement
Ads by CJ

స్టార్ హీరో కమల్ హాసన్ అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నారు. అభిమానులకు కమల్ హాసన్ లేఖ రాసారు. నా వర్క్ నచ్చి, నేను నచ్చి నాకు ఉలగనాయగన్ లాంటి బిరుదులు ఇచ్చారు. అందుకు థాంక్స్. ఆత్మీయులు, అభిమానులకు నన్ను అలా పిలుచుకోవడం ఇష్టం. నేను సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికి ఓ స్టూడెంట్ నే.

ఇంకా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని అనుకుంటాను, ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను, కళ కంటే కళాకారుడు గొప్ప అని నేను అనుకోను, అదే నా నమ్మకం. నటుడిగా బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకుంటున్నాను, స్టార్ టాగ్స్ నాకొద్దు. దానిని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను.

ఎన్నో ఏళ్లగా నాపై మీరు పెంచుకున్న ప్రేమకు ధన్యవాదాలు. మూలాలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, మీడియా మరియు అభిమానులు తనకు ఇకపై ఉలగనాయగన్ వంటి బిరుదులను ఉపయోగించకూడదని, దానికి బదులుగా తనను కమల్ హాసన్, కమల్ లేదా KH అని పిలవాలని కమల్ హాసన్ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.  

Kamal Haasan bids adieu to Ulaganayagan tag:

No more Ulaganayagan: Kamal Haasan requests fans to stop using nicknames

Tags:   KAMAL HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ