Advertisementt

RGV ని కూడా వదలట్లేదు!

Mon 11th Nov 2024 03:35 PM
rgv  RGV ని కూడా వదలట్లేదు!
RGV is not left out either! RGV ని కూడా వదలట్లేదు!
Advertisement
Ads by CJ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా.. జగన్ రెడ్డి అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై సినిమాలు తియ్యడమే కాదు, సోషల్ మీడియా వేదికగా కించపరిచేలా ట్వీట్లు వేసేవాడు, అప్పట్లో RGV  అధికార పక్షం మనదే అని రెచ్చిపోయాడు. 

ఎప్పుడైతే జగన్ ప్రభుత్వానికి ప్రజలు చుక్కలు చూపించి 11 సీట్లకే పరిమితం చేసారో అప్పుడే రామ్ గోపాల్ వర్మ కి బుద్దొచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల జోలికి రాను అంటూ మాటిచ్చేసాడు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మను కూడా వదిలేదెలే అంటుంది. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వం పై, టీడీపీ, జనసేన లపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి మానసికంగా బాదపెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్టులను కూటమి ప్రభుత్వం ఏరిపారేస్తుంది. 

బోరుగ‌డ్డ అనిల్ కుమార్ నుంచి మొదలు పెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ కి అనుకూలంగా, టీడీపీ, జనసేనలను వేధిస్తూ పోస్ట్ పెట్టిన వారందరిని అరెస్ట్ చేసి చుక్కలు చూపించే ప్రోగ్రాం పెట్టారు. శ్రీరెడ్డి లాంటి  సారీ చెప్పి తప్పించుకుందామనుకుంది. మరి చంద్రబాబు, లోకేష్, పవన్ లపై పైశాచికానందం పొందేలా సినిమాలు చేసిన RGV ని ఎందుకు వదులుతుంది. 

తాజాగా ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడులో RGV కి పై కేసు న‌మోదైంది. అక్క‌డి స్థానిక టీడీపీ నేత‌లు వ‌ర్మ‌పై పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు, లోకేష్‌, బ్రాహ్మ‌ణి ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌ని, ఈ మేర‌కు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక నేత‌లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి RGV కి ఎప్పుడు అరెస్ట్ వారెంట్ వస్తుందో చూడాలి. 

RGV is not left out either!:

Police Case on RGV In AP

Tags:   RGV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ