Advertisementt

అమ్మ అవ్వాలనుంది అంటున్న సమంత

Mon 11th Nov 2024 01:09 PM
samantha  అమ్మ అవ్వాలనుంది అంటున్న సమంత
Samantha on becoming a mother అమ్మ అవ్వాలనుంది అంటున్న సమంత
Advertisement
Ads by CJ

సిటాడెల్ హనీ - బన్నీ వెబ్ సీరీస్ తో ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత ఆ సీరీస్ లో తల్లి పాత్ర పోషించింది అంతేకాదు.. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ ఇరగదీసింది. అయితే సిటాడెల్ హానీ-బన్నీ ప్రమోషన్స్ లో రెండో పెళ్లి పై తికమకగా సమాధానం ఇచ్చిన సమంత ఒకసారి.. ప్రేమ పెళ్లి, అది విడాకులకు దారితియ్యడం అన్ని జరిగిపోయాయి, ప్రస్తుతం రెండో పెళ్లి ఆలోచన లేదు, ఒంటరి జీవితం బావుంది అని చెప్పింది. 

మరొకసారి తనకి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఉంది అన్న సమంత తాజాగా అమ్మని అవ్వాలని ఉంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో సమంత తాను పోషించిన అమ్మ పాత్ర గురించి మాట్లాడుతూ.. తనకి అమ్మ అవ్వాలనే కలలు ఉన్నాయి, అమ్మ అవ్వడానికి ఇష్టపడతాను. 

దానికి సమయం అయ్యిపోయింది అని నేను అనుకోను. ప్రస్తుతం లైఫ్ లో చాలా హ్యాపీ గా ఉన్నాను అంటూ సమంత అమ్మతనం పై చేసిన కామెంట్స్ మాత్రం హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి.  

Samantha on becoming a mother:

Samantha shares her thoughts on becoming a mother

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ