Advertisementt

రాజమౌళి-మహేష్ బడ్జెట్టే 1000 కోట్లు

Sun 10th Nov 2024 10:01 PM
mahesh babu  రాజమౌళి-మహేష్ బడ్జెట్టే 1000 కోట్లు
Mahesh babu and Rajamouli Movie Latest Update రాజమౌళి-మహేష్ బడ్జెట్టే 1000 కోట్లు
Advertisement
Ads by CJ

రాజమౌళి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లో1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఈ చిత్రాలు ఎన్ని వందల కోట్లతో తెరకెక్కాయో అనేది పూర్తి క్లారిటీ లేకపోయినా మూడు నుంచి ఆరు వందల కోట్లకు పై మాటే బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు మాత్రం రాజమౌళి తన తదుపరి మూవీ బడ్జెట్ నే 1000 కోట్లుగా తెలుస్తుంది. 

మహేష్ బాబు తో రాజమౌళి చెయ్యబోయే SSMB 29 చిత్రానికి రాజమౌళి దాదాపుగా 1000 నుంచి 1200 కోట్ల బడ్జెట్ లో ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ తో దానిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లారు. సో బడ్జెట్ కూడా పాన్ ఇండియా మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ కి పెరిగిపోయింది. 

టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ SSMB 29 పై చేసిన కామెంట్స్ ఆయన చెప్పిన SSMB 29 బడ్జెట్ అందరికి షాకిచ్చాయి. SSMB 29 కి బడ్జెట్1000 కోట్లు ఉంటుందని, హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్ల ను తీసుకోవడమే కాదు.. వరల్డ్ వైడ్ గా అనేక భారీ లొకేషన్లలో SSMB 29 షూట్ చేస్తారు కాబట్టే అంత బడ్జెట్ ఈ మూవీకి పెడుతున్నట్లుగా ఆయన చెబుతున్నారు. 

1000 కోట్ల బడ్జెట్ అంటే దానికి కలెక్షన్స్ టార్గెట్ 2000 కోట్ల కు పైగానే ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే సినిమాతో అన్ని లెక్కలు మారబోతున్నాయంటూ తమ్మారెడ్డి ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు పెంచేశారు.

Mahesh babu and Rajamouli Movie Latest Update:

Rajamouli-Mahesh movie update

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ