Advertisementt

హృతిక్-ఎన్టీఆర్-ఓ బాలీవుడ్ స్టార్

Sun 10th Nov 2024 08:30 PM
war 2  హృతిక్-ఎన్టీఆర్-ఓ బాలీవుడ్ స్టార్
Another Super Star Entry In War 2 Climax హృతిక్-ఎన్టీఆర్-ఓ బాలీవుడ్ స్టార్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. దేవర తో పాన్ ఇండియాలో సత్తా చూపించిన ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యారు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై లో ఉన్నారు. 

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వార్ 2 లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో క్యామియో ఇవ్వబోతున్నారట. వార్ 2 క్లైమాక్స్ లో బాలీవుడ్ బడా స్టార్ హీరో ఎంటర్ అవుతారని, ఆ రోల్ వార్ 2లో చాలా హైలెట్ అవుతుంది అంటున్నారు. వార్ 2 క్లైమాక్స్ ను షూట్ చేయడానికి అయాన్ ఓ భారీ సెట్ వేయిస్తున్నారని.. ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్-హృతిక్ రోష‌న్‌ ల మధ్యన హోరాహోరీగా ఫైట్ ఉంటుంది అని తెలుస్తోంది. 

వార్ 2 లో కనిపించబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆత్రుత పడిపోతున్నారు. 

Another Super Star Entry In War 2 Climax:

Another Super Star Entry In War 2 Climax

Tags:   WAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ