రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ టీజర్ నిన్న శనివారం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గ్రాండ్ గా నిర్వహించారు. దర్శకుడు శంకర్ తప్ప ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, నిర్మాత దిల్ రాజు ఇలా అందరూ పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ టీజర్ లో రామ్ చరణ్ మూడు వేరియేషన్స్ లుకి చూసి మెగా ఫ్యాన్స్ పడిపోయారు.
ఇక జనవరి 10 న సంక్రాంతి స్పెషల్ గా గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్నటివరకు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేసి మెగా అభిమానులకు పరీక్ష పెట్టిన మేకర్స్ ఇకపై గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ను వేరే లెవల్లో ప్రెజెంట్ చేయబోతున్నారు.
గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది ఓకె .. మరి ట్రైలర్ ఎప్పుడు వదులుతారనే ప్రశ్నకు.. శంకర్ అండ్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి కూడా ముహూర్తం పెట్టేశారట. అది డిసెంబర్ 31 నైట్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ ని ఓ భారీ ఈవెంట్ తో లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ పై ఇక మెగా ఫ్యాన్స్ కి దిగులక్కర్లేదన్నమాట.