వెండితెర మీద అవకాశాలు తగ్గగానే బుల్లితెర మీదకి షిఫ్ట్ అయ్యి సీరియల్ ఆర్టిస్ట్ గా మారిన కస్తూరి ఎప్పటికప్పుడు వివాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఓ బహిరంగ సభలో కస్తూరి తమిళనాడులో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
300 ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంత: పుర మహిళలకి సేవ చేయడానికి తెలుగువారు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారంతా ఎన్నో ఏళ్లగా స్థిరపడిన బ్రాహ్మణులేనని, కానీ ఇప్పుడు వారిని తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.
అంతేకాదు కస్తూరిపై కేసు నమోదు కావడం, తెలుగు సంఘాలు కస్తూరిని టార్గెట్ చెయ్యడంతో ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబమని ఇది తెలుసుకోకుండా కొందరు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని మండిపడింది.
తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించి.. నాపై వ్యతిరేకత తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేయిస్న్ది.ఇక ఆమెపై కేసు నమోదు కావడంతో పోలీసులు కస్తూరి అరెస్ట్ కు రంగం సిద్ధం చెయ్యడంతో కస్తూరి పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆమె ఇంటివద్దకు వెళ్లిన పోలీస్ లకు అక్కడ తాళం దర్శనమివ్వడంతో వారు షాకయ్యారని సమాచారం.