Advertisementt

పుష్ప 2 ద రూల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

Sun 10th Nov 2024 01:48 PM
  పుష్ప 2 ద రూల్ ట్రైలర్ డేట్ ఫిక్స్
Pushpa 2 The Rule Trailer Date Fix పుష్ప 2 ద రూల్ ట్రైలర్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం పుష్ప 2 ద రూల్. ఈ చిత్రం డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది. పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా రాబోతున్న ఈచిత్రం పై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన అంచనాలున్నాయి. మేకర్స్ ఓ పక్క ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. సుకుమార్ అల్లు అర్జున్-శ్రీలీల పై స్పెషల్ సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. 

ఇక పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప ద రూల్ ట్రైలర్ డేట్ లాక్ అయినట్లుగా తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయినా.. పుష్ప 2 ట్రైలర్ ఈ నెల 17 న వదలబోతున్నారు. అది కూడా ముంబై వేదికగా పుష్ప ద రూల్ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 

ముంబై నుంచి మొదలు పెట్టి పలు సిటీస్ లో పుష్ప ద రూల్ ఈవెంట్స్ ని నిర్వహించడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. సుకుమార్ ఇటు షూటింగ్ ఫినిష్ చెయ్యడమే తరువాయి అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్స్ లోకి  దిగిపోతారు, రష్మిక, ఫహద్ ఫాసిల్ అలాగే కీలక నటులంతా పుష్ప 2 ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. 

Pushpa 2 The Rule Trailer Date Fix:

Pushpa 2: The Rule Trailer Release As A Grand Affair

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ