Advertisementt

సుకుమార్ కరెక్టా.. అల్లు అర్జున్ కరెక్టా

Sun 10th Nov 2024 11:39 AM
pushpa the rule  సుకుమార్ కరెక్టా.. అల్లు అర్జున్ కరెక్టా
Sukumar correct or Allu Arjun correct సుకుమార్ కరెక్టా.. అల్లు అర్జున్ కరెక్టా
Advertisement
Ads by CJ

దర్శకుడు సుకుమార్ ఏ సినిమా అయినా ఫైనల్ అవుట్ ఫుట్ పెర్ఫెక్ట్ గా వచ్చేవరకు చెక్కుతూనే ఉంటారు. లెక్కల మాస్టారు, ఏ విషయంలో అయినా ఖచ్చితమైన లెక్కలు పాటిస్తారు. అందుకే పుష్ప ద రూల్ షూటింగ్ ఫినిష్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం పడుతుంది అని ఆగస్టు 15 నుంచి పుష్ప 2 రిలీజ్ డేట్ మార్చి డిసెంబర్ 5 కి ఇచ్చారు. ఆ సమయం కూడా సరిపోదు అని సుకుమార్ మొత్తుకున్నారు 

కానీ అల్లు అర్జున్ గత మూడేళ్ళుగా పుష్ప2 ప్రాజెక్ట్ పై ఉండిపోయాను, చాలా లాస్ అయ్యాను, ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ 5నే పుష్ప 2 రావాలి అప్పుడే తాను ఫ్రీ అవుతానని పట్టు బట్టాడు. అందుకే మేకర్స్ పుష్ప 2 ని డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ చెయ్యాలి అని అనుకున్నా అల్లు అర్జున్ మాత్రం అదే డేట్ కి రప్పిస్తున్నాడు. 

మరోపక్క సుకుమార్ నిద్ర లేకుండా వర్క్ చేస్తున్నా పుష్ప2 పనులు ఓ కొలిక్కి రావట్లేదు. షూటింగ్, పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ అంటూ సుకుమార్ పరుగులు పెడుతున్నారు. అసలు మీడియా ముందుకు సుకుమార్ వస్తారా.. పుష్ప 2 ప్రమోషన్స్ లో పాల్గొంటారా అంటే అది అయ్యే పనిగా కనిపించడం లేదు. 

ఈ హరి బరీ ఎందుకు కూల్ గా వచ్చే ఏడాది పుష్ప 2 ని రిలీజ్ చేస్తే బావుండేది అని సుకుమార్ ఆలోచన, కానీ అల్లు అర్జున్ ప్రొబ్లెమ్స్ అల్లు అర్జున్ వి. మరి ఈ విషయంలో సుకుమార్ కరెక్టా.. అల్లు అర్జున్ కరెక్టా అనేది ఇప్పడు ఫిలిం సర్కిల్స్ లో నడుస్తున్న పెద్ద చర్చ. పుష్ప 2 రిజల్ట్ తో అది తేలిపోతుంది. 

Sukumar correct or Allu Arjun correct:

Pushpa The Rule promotions without Sukumar

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ