Advertisementt

ప్రభాస్ vs డాన్ లీ.. ఏంటి మేటర్

Sun 10th Nov 2024 10:49 AM
don lee  ప్రభాస్ vs డాన్ లీ.. ఏంటి మేటర్
South Korean actor in Salaar 2 ప్రభాస్ vs డాన్ లీ.. ఏంటి మేటర్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో గత ఏడాది డిసెంబర్లో విడుదలై సెన్సేషనల్ మాస్ హిట్ గా నిలిచిన సలార్ పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కాల్సిన సలార్ 2 సౌర్యంగ పర్వ ఇప్పట్లో లేదు అనుకున్న సమయంలో సడన్ గా సలార్ 2 మేకర్స్ షూట్ బిగిన్స్ అంటూ ఇచ్చిన అప్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను నిలువనియ్యడం లేదు. 

ఈ ఏడాది మే లో మొదలవుతుంది అనుకున్న సలార్ 2 షూటింగ్ ఆగస్టు కొచ్చినా మొదలు కాలేదు, మరోపక్క ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ మొదలయ్యింది, ఇంకోపక్క ప్రభాస్ రాజా సాబ్, హను మూవీ షూటింగ్స్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పట్లో సలార్ 2 తెరకెక్కే చాన్స్ లేదు అనుకున్నారు. ఇక సలార్ 1 లో చాలామంది విలన్స్ గా కనిపించగా.. సలార్ 2లో పృథ్వీ రాజ్ సుకుమార్ తో పాటుగా కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ కేరెక్టర్ లో నటిస్తారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

కానీ ఈ విషయమై సలార్ మేకర్స్ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా సలార్ 2 షూటింగ్ మొదలైన నేపథ్యంలో డాన్ లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సలార్ 2 టీమ్ కి  ఆల్ ది బెస్ట్ చెప్పడంతో.. ఏంటి మేటర్ డాన్ లీ, సలార్ 2 లో నటిస్తున్నావా ఏంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డాన్ లీ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. 

ఒకవేళ ప్రభాస్ vs డాన్ లీ తలపడితే థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే.. ప్రశాంత్ నీల్ ఈ కాంబో ని సెట్ చేస్తే మాములుగా ఉండదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.  

South Korean actor in Salaar 2:

Korean superstar Don Lee sharing Salaar 2 poster sparks

Tags:   DON LEE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ