గత ఐదేళ్ళలో చంద్రబాబు ఇకపై రాజకీయాలకు పనికిరారు, ఆయన పనైపోయింది, ఆయనకు వయసైపోయింది ఇకపై మనదే రాజ్యం, చంద్రబాబు నథింగ్ అంటూ మాట్లాడుతూనే ఉన్న జగన్ ఇప్పుడు రియలైజ్ అయ్యే టైమ్ వచ్చింది, చంద్రబాబు నథింగ్ కాదు, అది గుర్తిస్తే జగన్ కు మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం వస్తుంది, చంద్రబాబు ని శక్తిగా గుర్తిస్తే జగన్ కు మేలు అంటూ బ్లూ మీడియా జగన్ కి చెప్పే ప్రయత్నమైతే మొదలు పెట్టింది.
చంద్రబాబు ఏపీని అప్పుల పాలు చేస్తాడు, నేను ఇచ్చే పథకాలతో మీరు సుఖంగా ఉండండి అంటూ నెలకోసారి పేదలకు పథకాల పేరిట చంద్రబాబు ను పనిగట్టుకుని విమర్శించిన జగన్ ఇప్పుడు చంద్రబాబు రాజకీయం ముందు పిల్ల బచ్చలా కనిపిస్తున్నాడంటూ బ్లూ మీడియానే వాపోతుంది. చంద్రబాబు ని పొగడడం కాదు, ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసారు.
అధికారం కోసం పడుతూ, లేస్తూ తపనపడే పెద్దాయనని నువ్వు నథింగ్ అంటూ ఐదేళ్లుగా తీసిపారేసావ్, ఇప్పుడు కూడా నథింగ్ అంటూ చంద్రబాబు ని లైట్ తీసుకుంటే.. ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి, భవిష్యత్తులో ఇక వైసీపీ కి మనుగడ ఉండదు అంటూ జగన్ ను బ్లూ మీడియా హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
బ్లూ మీడియాలో మార్పు రావడానికి అసలు కారణం.
గత వారం రోజులుగా బ్లూ మీడియా ముసుగులో సోషల్ మీడియాలో అధికార పక్షంపై చేసే నీచమైన పోస్ట్ ల తాలూకు వ్యక్తులను కూటమి ప్రభుత్వం వేటాడి వెంటాడుతుంది. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళను వరసగా అరెస్ట్ లు చెయ్యడం వెనుక జగన్ హస్తం ఉంది, జగన్ వైసీపీ కార్యకర్తలను కాపాడుకోలేకపోయారంటూ ఇప్పుడు బ్లూ మీడియా నెత్తినోరు కొట్టుకుంది. అందుకే చంద్రబాబు నథింగ్ కాదు ఓ శక్తిగా బ్లూ మీడియా గుర్తించింది.