Advertisementt

గేమ్ ఛేంజర్ టీజర్ : చరణ్ అన్ ప్ప్రెడిక్టబుల్ షో

Sat 09th Nov 2024 06:45 PM
game changer  గేమ్ ఛేంజర్ టీజర్ : చరణ్ అన్ ప్ప్రెడిక్టబుల్ షో
Game Changer Teaser : Ram Charan Unpredictable Show గేమ్ ఛేంజర్ టీజర్ : చరణ్ అన్ ప్ప్రెడిక్టబుల్ షో
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతుంది. దానితో గేమ్ ఛేంజర్ టీం చిత్ర ప్రమోషన్స్ ను డిఫ్రెంట్ గా స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈ రోజు శనివారం ఉత్తరప్రదేశ్ లక్నో లో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. 

గేమ్ చెంజర్ టీజర్ లోకి వెళితే.. బేసిక్ గా రామ్ అంత మంచివాడు ఇంకొకడు లేడు అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్.. కానీ వాడికి కోపమొస్తే.. వాడంత చెడ్డోడు ఇంకొకడు లేడు అంటూ ఇచ్చిన హైప్ కి మించి రామ్ చరణ్ యంగ్ లుక్స్ లో కనిపించిన ప్రతి షాట్ కి అభిమానులకు పూనకాలు రావాల్సిందే. 

బైక్ షాట్, హెలికాఫ్టర్ షాట్, యాక్షన్ లో చరణ్ ఎనేర్జి ఇలా అన్ని సీన్స్ లో అభిమానులు విజిల్స్ వెయ్యాల్సిందే. కియారా అద్వానీ గ్లామర్ లుక్, సాంగ్స్ లో కనిపించే కాస్ట్లీ విజువల్స్, విలన్ కేరెక్టర్ ఎస్ జె సూర్య ఏం చెశాడ్రా వాడు అంటూ అరుస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, శంకర్ మేకింగ్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టీజర్ కి మెయిన్ హైలెట్ గా నిలిచాయి. 

అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, కానీ.. రామ్ చరణ్ వైట్ అండ్ వైట్ లుక్ విషయంలో అభిమానులు కొద్దిగా డిజప్పాయింట్ అవుతున్నారు. యంగ్ రామ్ చరణ్ లుక్స్ తో పోలిస్తే ఆ లుక్ తేలిపోయింది అంటున్నారు. ఇక టీజర్ చివరిలో ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్ అంటూ చరణ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ మాత్రం టీజర్ కే హైలైట్. 

Game Changer Teaser : Ram Charan Unpredictable Show:

Game Changer Teaser Review

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ