Advertisementt

మరో వారం పండగ చేసుకోండి

Sat 09th Nov 2024 11:52 AM
lucky bhaskar  మరో వారం పండగ చేసుకోండి
Celebrate another week మరో వారం పండగ చేసుకోండి
Advertisement
Ads by CJ

గత వారం దీపావళి సందర్భంగా నవంబర్ 31 న థియేటర్స్ లో పోటీపడిన లక్కీ భాస్కర్, క, అమరన్ చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. హిట్ టాక్ మాత్రమే కాదు సూపర్ హిట్ కలెక్షన్స్ తో అమరన్, క, లక్కీ భాస్కర్ దూసుకుపోతున్నాయి. ప్రేక్షకులు మూడు చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. 

లక్కీ భాస్కర్ బ్యాంక్ లలో లొసుగులను, ఓ తెలివైనవాడు మోసం చెయ్యకుండానే తెలివిగా కోట్లు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ తో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. వరస పరాజయాలతో ఉన్న కిరణ్ అబ్బవరం క చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. క కంటెంట్ బావుండడంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. 

ఇక శివ కార్తికేయన్-సాయి పల్లవి ల అమరన్ చిత్రం భావోద్వేగాల అలజడిగా ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చెయ్యడంలో 100 పెర్సెంట్ సక్సెస్ అవడంతో నిర్మాతలు లాభాల బాట పట్టారు. ఇక ఈ చిత్రాలు విడుదలై వారం గడిచి రెండో వారంలోకి ప్రవేశించాయి. ఈ వారంలో విడుదలైన అపుడో ఇపుడో ఎపుడో, జితేందర్ రెడ్డి, ధూమ్ ధామ్, ఆదిపర్వం లాంటి చిన్న చిత్రాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. 

దానితో గత వారం విడుదలైన లక్కీ భాస్కర్, క, అమరన్ చిత్రాలు ప్రేక్షకులకు మరో వారం బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. అందుకే మరో వారం ఆ మూడు చిత్రాలతో పండగ చేసుకోండి అనేది. 

Celebrate another week:

The films of Lucky Bhaskar, Amaran and Ka are not waiting for the second week as well

Tags:   LUCKY BHASKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ