Advertisementt

అదే మ్యాజిక్ రామ్ చరణ్ రిపీట్ చేస్తాడా..

Sat 09th Nov 2024 08:36 AM
ram charan  అదే మ్యాజిక్ రామ్ చరణ్ రిపీట్ చేస్తాడా..
Will Ram Charan repeat the same magic? అదే మ్యాజిక్ రామ్ చరణ్ రిపీట్ చేస్తాడా..
Advertisement
Ads by CJ

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన బ్రుస్ లీ చిత్రం ఎంత డిజాస్టరో అందరికి గుర్తుండే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర కూడా సినిమాను కాపాడలేక అట్టర్ ప్లాప్ గా మిగిలింది. అయితే ఆ చిత్రంలో జోడిగా నటించిన రకుల్ ను మళ్ళీ మరో సినిమాకి ఓకె అన్నాడు రామ్ చరణ్. అదే ధ్రువ. మాములుగా ఫెయిల్యూర్ కాంబినేషన్ ని రిపీట్ చెయ్యడానికి ఇష్టపడరు హీరోలు. ఆ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయినా ధ్రువ సినిమాకి రకుల్ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని రామ్ చరణ్ అదే రకుల్ తో హిట్ కొట్టి చూపించాడు. 

ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయగలడా. బాలకృష్ణ తో భీభత్సమైన హిట్లు కొట్టి మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో చేసిన అరవీరభయంకర మాస్ సినిమా వినయ విధేయ రామ. విచిత్రమేమిటంటే ఆ సినిమా కూడా అరవీరభయంకర డిజాస్టర్ గా మిగిలింది. 

కానీ మళ్ళీ అదే హీరోయిన్ కి అంగీకారం తెలిపాడు రామ్ చరణ్. మళ్ళీ తనతోనే గేమ్ చెంజర్ అంటూ వస్తున్నాడు. ఈసారి శంకర్ లాంటి సత్తా ఉన్న దర్శకుడు ఉన్నాడు. దిల్ రాజు లాంటి గట్టి నిర్మాత ఉన్నాడు, మూడేళ్ళ నుంచి చెక్కుతూ వస్తున్నారు, మూడు నెలలుగా ఊరిస్తున్నారు. వస్తోంది సంక్రాంతికి, చూస్తాం ఫలితాన్ని. అదే మ్యాజిక్ రిపీట్ చేయగలడా రామ్ చరణ్..!

Will Ram Charan repeat the same magic?:

Ram Charan romance Kiara Advani in game Changer

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ