Advertisementt

వేణు స్వామిని వదిలేలా లేరు

Fri 08th Nov 2024 04:35 PM
venu swamy  వేణు స్వామిని వదిలేలా లేరు
They cannot leave Venu Swamy వేణు స్వామిని వదిలేలా లేరు
Advertisement
Ads by CJ

ఆస్ట్రాలజర్ వేణు స్వామిని మహిళా కమిషన్ వదిలేలా కనిపించడం లేదు. తప్పుడు జాతకాలు చెబుతూ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసే వేణు స్వామి విషయంలో ఫిలిం జర్నలిస్ట్ లు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు. నాగ ఛైతన్య-శోభిత దూళిపాళ్ల ఎంగజ్మెంట్ చేసుకున్న రోజే వేణు స్వామి వాళ్ళు విడిపోతారంటూ చెప్పిన జాతకం సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఏమి స్పందించకపోయినా.. ఫిలిం జర్నలిస్టులు మహిళా కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చెయ్యడంతో వేణు స్వామిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. దానితో తనను విచారించే అధికారం మహిళా కమిషన్ కు లేదంటూ హై కోర్టు నుంచి స్టే తెచుకున్నాడు. 

తాజాగా కోర్టు స్టే ఎత్తెయ్యడంతో మళ్ళీ మహిళా కమిషన్ వేణు స్వామిని మరోసారి విచారణకు పిలిచినా రాకపోవడంతో.. మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14న వేణుస్వామిని విచారణకు రావాలని ఆదేశించింది. మరి ఇప్పుడు వేణుస్వామి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

They cannot leave Venu Swamy:

Astrologer Venu Swamy Cannot Escape

Tags:   VENU SWAMY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ