Advertisementt

చైతు-శోభిత వెడ్డింగ్: కౌన్ డౌన్ స్టార్ట్

Wed 06th Nov 2024 06:38 PM
naga chaitanya  చైతు-శోభిత వెడ్డింగ్: కౌన్ డౌన్ స్టార్ట్
Naga Chaitanya-Sobhita Dhulipala Wedding: Countdown Start చైతు-శోభిత వెడ్డింగ్: కౌన్ డౌన్ స్టార్ట్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఇద్దరూ రెండేళ్లుగా సీక్రెట్ గా డేటింగ్ చేసినా, ఆగస్టు 8 న ఎవరిని పిలవకుండా నిశ్చితార్ధం చేసుకున్నా ఈ జంట ఆ తర్వాత పబ్లిక్ గా ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని అనౌన్స్ చేసింది అక్కినేని ఫ్యామిలీ. ఇక నాగ చైతన్య-శోభిత పెళ్ళెప్పుడు అంటూ అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. 

డిసెంబర్ 4 న చైతు-శోభితల వివాహానికి ఇరు కుటుంబాల వారు తేదీని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోపక్క శోభిత ఇంటి దగ్గర పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. అంటే పెళ్లి పనులు మొదలిపోయినట్లే. ఇక నాగ ఛైతన్య ,శోభిత ఇద్దరూ పెళ్ళికి రెడీ అవుతున్నారు. తాజాగా శోభిత సిస్టర్ సమంత వీరి పెళ్లిపై చేసిన పోస్ట్ వైరల్ అయ్యి కూర్చుంది. 

తాను, శోభిత అలాగే తన తల్లితండ్రులు ఉన్న పిక్ ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కౌన్ డౌన్ స్టార్ట్ అంటూ పెట్టిన పోస్ట్ అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చింది. చైతు-శోభితా వివాహాన్ని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసే స్పెషల్ సెట్ లోనే చెయ్యతలపెట్టినట్లుగా సమాచారం. మరోక్క నెల మాత్రమే సమయం ఉంది చైతు-శోభిత ఓ ఇంటివారవ్వడానికి. 

Naga Chaitanya-Sobhita Dhulipala Wedding: Countdown Start:

Naga Chaitanya and Sobhita Dhulipala will tie the knot on December 4

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ