Advertisementt

లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ లాక్డ్

Wed 06th Nov 2024 05:12 PM
lucky baskhar  లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ లాక్డ్
Lucky Baskhar OTT Date Locked లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ లాక్డ్
Advertisement
Ads by CJ

దుల్కర్ సల్మాన్-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కి దీపావళి ఫెస్టివల్ స్పెషల్ గా విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ ఆడియన్స్ నుంచే కాదు క్రిటిక్స్ నుంచి కూడా ఓవరాల్ గా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా లక్కీ భాస్కర్ కొత్త నంబర్లు నోట్ చేస్తుంది. థియేటర్స్ లో బిగ్ హిట్ అయిన లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ పై అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలయ్యింది. 

మొదటి వీకెండ్ మాత్రమే కాదు మిడ్ వీక్ లోను కలెక్షన్స్ తో అదరగొడుతున్న లక్కీ భాస్కర్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. అయితే అక్టోబర్ 31 న విడుదలై లక్కీ భాస్కర్ నాలుగు వారాల గ్యాప్ తో ఓటీటీలోకి రావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

అంటే నవంబర్ 30 నుంచి లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రావొచ్చని తెలుస్తుంది. అయితే థియేటర్స్ లో విడుదలై ఇంకా వారం కూడా పూర్తికాక ముందే లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ పై ఇలాంటి వార్తలు రావడం మేకర్స్ కి ఇబ్బందికర విషయమే. 

Lucky Baskhar OTT Date Locked:

Lucky Baskhar locks OTT partner locked

Tags:   LUCKY BASKHAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ