Advertisementt

బాలీవుడ్ రామాయణ పై ఫస్ట్ అప్ డేట్

Wed 06th Nov 2024 01:50 PM
ranbir kapoor  బాలీవుడ్ రామాయణ పై ఫస్ట్ అప్ డేట్
Ranbir Kapoor Ramayana Part 1 and 2 officially announced బాలీవుడ్ రామాయణ పై ఫస్ట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణ మూవీపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణ్ గా, అలాగే సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత గా కనిపించబోయే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నప్పటికీ.. ఈ చిత్రానికి సంబందించిన ఏ చిన్న అప్ డేట్ మాత్రం ఇవ్వలేదు. 

ఇప్పుడు బాలీవుడ్ రామాయణ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చెయ్యకుండానే మొదటి బిగ్గెస్ట్ అప్ డేట్ ఇచ్చేసారు. అది కూడా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ వచ్చేసింది. రామాయణ మొదటి భాగం 2026 దీపావళి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఈ రామాయణాన్ని రెండు భాగాలుగా 1000 కోట్ల బడ్జెట్ తో నితేశ్ తివారి తెరకెక్కిస్తున్నారు. 

ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. రామాయణ నిర్మాణ భాగస్వామిగా కన్నడ హీరో, ఇందులో రావణ్ పాత్రధారి యష్ ఉండబోవడం. ఇక ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయం క్లారిటీ లేదు. సన్నీ డియోల్ ని హనుమంతుడి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా నటిస్తున్నారనే టాక్ తప్ప అఫీషియల్ అప్ డేట్ అయితే లేదు. 

Ranbir Kapoor Ramayana Part 1 and 2 officially announced:

Ranbir Kapoor Ramayana Part 1 and 2 release dates out

Tags:   RANBIR KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ