Advertisementt

రాజమౌళి ని తలదన్నేలా శంకర్ ప్లానింగ్

Wed 06th Nov 2024 12:04 PM
game changer  రాజమౌళి ని తలదన్నేలా శంకర్ ప్లానింగ్
Shankar planning more than Rajamouli రాజమౌళి ని తలదన్నేలా శంకర్ ప్లానింగ్
Advertisement
Ads by CJ

రాజమౌళి ఎంత పర్ఫెక్ట్ గా సినిమాలు తెరకెక్కిస్తారో, ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు అంతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారు. బాహుబలి అప్పటి నుంచే కాదు అంతకుముందు సినిమాల విషయంలోనూ రాజమౌళి ప్రమోషన్స్ ను లైట్ తీసుకోలేదు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలకు రాజమౌళి ప్రమోషన్స్ ప్లానింగ్ కు పాన్ ఇండియా ప్రేక్షకులు పడిపోయారు. 

ఆ తర్వాత ఏ పాన్ ఇండియా ఫిలిం ని మేకర్స్ అంతలా ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. దేవర కూడా అలా అలా ప్రమోషన్స్ చుట్టేశారు. ఇప్పుడు రాబోయే పుష్ప 2 ద రూల్ విషయంలోనూ మేకర్స్ కి ప్రమోషన్స్ చెయ్యడానికి తగిన సమయమైతే లేదు. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ ప్లానింగ్ రాజమౌళి ప్లానింగ్ కి తలదన్నే రీతిలో కనిపిస్తుంది. 

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ నుంచే సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యబోతున్నారు. నిన్న దిల్ రాజు చెన్నైలో గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ పెట్టారు. రేపు 9 న ఉత్తరప్రదేశ్ లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ వదలబోతున్నారు. అంతేకాదు డిసెంబర్ లో అమెరికా వెళ్లి అక్కడ ఓ పెద్ద గేమ్ ఛేంజర్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. 

జనవరి 1 తర్వాత గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబైలో ప్లాన్ చేసారని వినికిడి. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి మొదటి వారంలో తెలంగాణ లేదా ఏపీలో నిర్వహించేలా శంకర్ ప్లానింగ్ ఉంది అంటున్నారు. మరి ఇది రాజమౌళి ప్లానింగ్ కి మించేలా కనిపించడం లేదూ.. !

Shankar planning more than Rajamouli:

Game Changer promotions on a different level

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ