Advertisementt

నాగార్జున గారు సినిమా ఎప్పుడండీ..

Wed 06th Nov 2024 10:41 AM
nagarjuna  నాగార్జున గారు సినిమా ఎప్పుడండీ..
Akkineni fans waiting for Nagarjuna new project నాగార్జున గారు సినిమా ఎప్పుడండీ..
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున ప్రస్తుతం సోలో హీరోగా ఏ సినిమాకి కమిట్ అవలేదు. అలాగని ఆయన ఖాళీగాను లేరు. ఒకపక్క టాలీవుడ్ బిగ్ బాస్ హోస్ట్ గా బాధ్యతలు, మరోపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి చిత్రంలో కీలక పాత్ర. ఇంకోపక్క ధనుష్ కుబేరాలో కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాని ఆయన హీరోగా మాత్రం ఎలాంటి సినిమా అనౌన్స్ చెయ్యడం లేదు. 

అక్కినేని అభిమానులు ఆ విషయంలో చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. నా సామి రంగ హిట్ తర్వాత నాగార్జున కుబేర, కూలి చిత్రాలపై ఫోకస్ పెట్టారు కానీ.. సోలో హీరోగా ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించడం లేదు. నా సామి రంగ తర్వాత నాగార్జున ఇంత గ్యాప్ తీసుకోవడం అభిమానులను కలవరపెడుతుంది. 

సోలో హీరోగా ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యకపోయినా నాగ్ చెన్నై, హైదరాబాద్ అంటూ తెగ తిరిగేస్తున్నారు. కూలి, కుబేర చిత్రాలు ఓ కొలిక్కి రాగానే నాగ్ తన కొత్త ప్రాజెక్ట్ ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. 

Akkineni fans waiting for Nagarjuna new project:

Nagarjuna new project update

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ