టీడీపీతో కలిసి జనసేన, బిజెపి పొత్తుతో పోటీ చేద్దామనే ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ఆయన్ని ఒప్పించారు పవన్. అయితే పవన్ తో మరోసారి పొత్తు పెట్టుకునేందుకు అంతకుముందు చంద్రబాబు చాలా ఆలోచించారు. 2014 లో సెట్ అయిన పొత్తు, 2019 కి వచ్చేసరికి చెడిపోయింది. అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు 2024 లో పవన్ తో పొత్తు విషయములో చాలా ఆలోచించారు.
అయినప్పటికీ ఆయన జైలుకు వెళ్లడంతో పరిస్థితిలు చేదాటి పోతున్నాయని గ్రహించిన పెద్దాయన పవన్, బీజేపీలతో కలిసేందుకు మొగ్గు చూపారు. అయితే పవన్ కళ్యాణ్ తో పొత్తు అనేది కత్తి మీద సాములాంటిది. అసలే దుందుడుకు స్వభావం, ఆవేశం ఎక్కువ-అనుభవం తక్కువ పవన్ కళ్యాణ్ కి.
ఇక చంద్రబాబు సీఎం అయ్యారు, పవన్ ని డిప్యూటీ సీఎం చేసారు. ఆ తర్వాత ప్రతి ఒక్క విషయంలో చంద్రబాబు పవన్ కు సముచిత స్తానం ఇస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను మీడియా ముందు పెట్టడం, కూటమిలో పొత్తు ధర్మాన్ని విస్మరించినట్టయ్యింది.
హోమ్ మినిస్టర్ అనిత మీకు చేతకాకపోతే చెప్పండి నా చేతుల్లోకి హోమ్ శాఖను తీసుకుంటానని చెప్పడం టీడీపీ కి మింగుడు పడలేదు. అయినప్పటికీ పొత్తు ధర్మం పాటించక తప్పదు. అందుకే పవన్ వ్యాఖ్యలపై అటు అనిత, ఇటు మంత్రి నారాయణ కవర్ చెయ్యలేక చచ్చిపోతున్నారు.
ఏమైనా పవన్ విషయంలో తేడాగా మాట్లాడితే ప్రతిపక్షాలకు దొరికిపోతారు. అందుకే పవన్ విషయంలో టీడీపీ మంత్రులు కవరింగ్ మొదలెట్టారంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.