Advertisementt

గేమ్ ఛేంజర్ టీజర్ పై పెంచుతున్న హైప్

Tue 05th Nov 2024 08:46 PM
ram charan  గేమ్ ఛేంజర్ టీజర్ పై పెంచుతున్న హైప్
The hype is building on the Game Changer teaser గేమ్ ఛేంజర్ టీజర్ పై పెంచుతున్న హైప్
Advertisement
Ads by CJ

ఈ నెల 9 న ఉత్తరప్రదేశ్ లక్నో లో రామ్ చరణ్-శంకర్-దిల్ రాజు ల పాన్ ఇండియా ఫిలిం గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ కి ముహూర్తం పెట్టారు. గేమ్ ఛేంజర్ టీజర్ వస్తే గేమ్ ఛేంజ్ అవుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ టీజర్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఎలా ఉన్నా ఇకపై శంకర్ మాత్రం గేమ్ ఛేంజర్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేయబోతున్నారని లక్నో ఈవెంట్ ఉదాహరణగా నిలవబోతుంది. 

అయితే గేమ్ ఛేంజర్ టీజర్ రెండు నిమిషాలకు కాస్త తక్కువగా అన్ ప్రిడిక్టబుల్ గా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలొ మేకర్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమందితో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ పై అంచనాలు క్రియేట్ చేసేలా ట్వీట్లు వేయిస్తున్నారు. ఒక్కసారి టీజర్ వస్తే ఇప్పుడున్న అంచనాలు రెట్టింపు అవుతాయంటున్నారు. 

కియారా అద్వానీ, అంజలి రామ్ చరణ్ సరసన నటిస్తుండగా.. ఎస్ జె సూర్య రామ్ చరణ్ తో తలపడబోయే విలన్ కేరెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025 సంక్రాంతి స్పెషల్ గా విడుదలకు సిద్దమవుతుంది. 

The hype is building on the Game Changer teaser:

Ram Charan - Game Changer Teaser 

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ