Advertisementt

షాకింగ్: ప్రభాస్ ఇది నిజమా..

Tue 05th Nov 2024 05:08 PM
prabhas  షాకింగ్: ప్రభాస్ ఇది నిజమా..
Shocking: Prabhas is this true.. షాకింగ్: ప్రభాస్ ఇది నిజమా..
Advertisement
Ads by CJ

ప్రభాస్ సిగరెట్ తాగుతాడు, ఫ్రెండ్స్ తో కలిసి మందేస్తాడు అనేది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపించే మాటే అయినా.. ఇంతవరకు ప్రభాస్ పబ్లిక్ గా అలాంటిపని చేసింది లేదు. అసలు ప్రభాస్ పార్టీలలో పాల్గొన్న దాఖలాలు కానీ, అతని మద్యం తాగుతాడనే విషయం కానీ ఎక్కడా కనిపించలేదు. 

అయితే అతను మంచి ఫుడీ. భోజనం విషయంలో అన్ని రకాల నాన్ వెజ్ లతో లాగించేస్తాడు. ఎంతైనా రాజులు కదా.. ఆ విషయంలో అస్సలు తగ్గరు. అదలా ఉంటే కొన్నాళ్లుగా ప్రభాస్ మొహం ఉబ్బిపోయి, కాస్త బరువుతో కనిపించడం చూసి అభిమానులు ఫీలైపోతుంటే.. ప్రభాస్ యాంటి ఫ్యాన్స్ తాగుబోతుగా చిత్రీకరించి మాట్లాడుతుంటారు. 

ఇప్పుడు ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ చేతిలో మందు గ్లాస్ తో కనిపించి షాకిచ్చాడు. ప్రభాస్ మద్యం తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ కొంతమంది షాకింగ్ గా, అనుమానంగా ప్రభాస్ ఇది నిజమా అని ఆరా తీస్తుంటే.. 

మరికొంతమంది ఓ సినిమా షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోలని చెబుతున్నారు. ప్రభాస్ తన అప్ కమింగ్ చిత్రంలో డ్రగ్ డీలార్ గా, చైన్ స్మోకర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. 

Shocking: Prabhas is this true..:

Pictures of Prabhas drinking alcohol are viral

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ