Advertisementt

మైసూర్ నుంచి స్టార్ట్ అవుతున్న RC 16

Tue 05th Nov 2024 03:28 PM
ram charan  మైసూర్ నుంచి స్టార్ట్ అవుతున్న RC 16
RC 16 starting from Mysore మైసూర్ నుంచి స్టార్ట్ అవుతున్న RC 16
Advertisement
Ads by CJ

ఈ నెల 9 న ఉత్తప్రదేశ్ లక్నోలో జరగబోయే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత రామ్ చరణ్ పది రోజుల గ్యాప్ తో అంటే నవంబర్ మూడో వారం నుంచి బుచ్చిబాబు దర్శకత్వంలో చెయ్యాల్సిన RC 16 సెట్స్ లోకి వెళతారని తెలుస్తోంది. ప్రస్తుతం RC 16 కోసం రగడ్ లుక్ లోకి మారుతున్న చరణ్ అతి త్వరలోనే RC 16 షూట్ లో జాయిన్ అవుతారట. 

RC 16 రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ని మైసూరులో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే షెడ్యూల్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంకా ఈ చిత్రంలో నటించబోయే కీలక నటులు కూడా పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. 

అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఆ సెకండ్ కేరెక్టర్ ఇంటర్వెల్ లోనే రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి RC 16 రెగ్యులర్ షూట్ పై మేకర్స్ అయితే ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు.

RC 16 starting from Mysore:

Ram Charan, Janhvi Kapoor Starrer RC16 shooting starts in Mysore 

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ