Advertisementt

సమంత కి కోపమొచ్చింది

Tue 05th Nov 2024 02:53 PM
samantha  సమంత కి కోపమొచ్చింది
Samantha got angry సమంత కి కోపమొచ్చింది
Advertisement
Ads by CJ

సమంత కు కోపమొచ్చింది. కారణం ఆమె బరువు పై నెటిజెన్ చేసిన ఓ కామెంట్ పై సమంత ఫైర్ అయ్యింది. ఈమధ్యన సమంత లుక్స్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. ఖుషి చిత్రంలో సమంత విజయ్ దేవరకొండ కు అక్కలా కనిపించింది, అసలు సమంత ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టలేదు అంటూ విమర్శించారు. 

కొద్దిరోజులుగా సమంత గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ కవ్విస్తున్నా ఆమె లుక్స్ విషయంలో సమంత అభిమానులే డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం సిటాడెల్ హానీ - బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో ఓ నెటిజెన్ కాస్త బరువు పెరగండి మేడమ్ అంటూ కామెంట్ చేసాడు. 

తన బరువు విషయంలో ఓపెన్ గా కామెంట్ చేసిన ఆ నెటిజెన్ పై కోపంతో సమంత ఇచ్చిపడేసింది. నా బరువు గురించి మీకేం తెలుసు. నాబరువు గురించి నాకు తెలుసు. నేను ప్రస్తుతం కఠినమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ డైట్ లో ఉన్నాను. నా బరువు అదుపులోనే ఉంది. నా హెల్త్ ఇష్యుస్ వలన నా బరువు ఇలానే ఉంటుంది. అది నాకు తెలుసు. దయచేసి ఎవరినైనా జెడ్జి చేసే ముందు ఆలోచించండి. ఎదుటివారిని కూడా జీవించనివ్వండి, ఇది 2024 అంటూ సమంత కాస్త కోపంగానే బదులిచ్చింది. 

Samantha got angry:

Samantha fires on netizen

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ