Advertisementt

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఎక్కడంటే..

Tue 05th Nov 2024 10:28 AM
game changer  గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఎక్కడంటే..
Game Changer Teaser Launch Where.. గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఎక్కడంటే..
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అప్ డేట్స్ విషయంలో ఆచితూచి మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన శంకర్ అండ్ కో ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు డిజప్పాయింట్ చేయమంటున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ని శంకర్, ఎస్ జె సూర్య, దిల్ రాజు సరదాగా రిలీజ్ చేసారు. 

నవంబర్ 9 న టీజర్ లాంచ్ అన్న మేకర్స్ ఇప్పుడు దానిని లక్నో లో ప్లాన్ చేసారు. చెన్నై, ముంబై, బెంగుళూరు కాకూండా డిఫ్రెంట్ గా నవంబర్ 9 న లక్నోలో గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసేసారు. అందుకు గాను తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ జర్నలిస్టు లను లక్నో కు ప్రత్యేకంగా తీసుకువెళుతున్నారు దిల్ రాజు. 

ఈ ఈవెంట్ తోనే పాన్ ఇండియా ప్రేక్షకులు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుకునేలా చెయ్యాలని శంకర్ ప్లాన్, గేమ్ ఛేంజర్ టీజర్ తో ప్రమోషన్స్ కు శ్రీకారం చుడుతూ ఇకపై పలు సిటీస్ లో సినిమాపై హైప్ తెచ్చేందుకు మరికొన్ని ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. 

Game Changer Teaser Launch Where..:

Game Changer teaser launch – Lucknow is set to host the event

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ