Advertisementt

బెయిలొచ్చింది.. ఇండియాకొచ్చాడు

Mon 04th Nov 2024 07:46 PM
harsha sai  బెయిలొచ్చింది.. ఇండియాకొచ్చాడు
YouTuber Harsha Sai in Shamshabad Airport బెయిలొచ్చింది.. ఇండియాకొచ్చాడు
Advertisement
Ads by CJ

యూట్యూబర్ హర్ష సాయి ఓ నటి ని మోసం చేసిన కేసులో పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో కాదు కాదు విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు ఈ కేసులో తనకు బెయిల్ రాగానే స్వదేశానికి తిరిగొచ్చాడు. నటిని పలుమార్లు హత్యాచారం చేసి ఆమె నుంచి రెండు కోట్లు తీసుకుని మోసం చేసాడు అంటూ హర్ష సాయి పై కేసు నమోదు అయ్యింది. 

హర్ష సాయి పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చెయ్యడంతో హర్ష సాయి పోలిసులకు దొరక్కుండా విదేశాలకు చెక్కేసాడు. తానేమి నేరం చెయ్యలేదు, మోసం చెయ్యలేదు, తనని ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా హర్ష సాయి స్పందించాడు. ఈ కేసులో తన లాయర్ తో హై కోర్టు నుంచి ముందస్తు బెయిల్ సంపాదించిన హర్ష సాయి తాజాగా విదేశాల నుంచి దిగాడు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన హర్ష సాయి ని మీడియా ముట్టడించింది. ఈ కేసు నమోదు అయ్యాక మొదటిసారి మీడియా ముందుకొచ్చిన హర్ష సాయి ఒక చిన్న పని మీద విదేశాలకు వెళ్లాను, అక్కడ పని పూర్తి కాగానే నేడు హైదరాబాద్ కు తిరిగి వచ్చాను. నా మీద వచ్చిన ఆరోపణలు అసత్యం కాబట్టే బెయిల్ మంజూరయింది, నేను ఎవ్వరిని మోసం చెయ్యలేదు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే ఊరుకోను, నేను ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు అంటూ హర్ష సాయి తన కేసుపై రియాక్ట్ అయ్యాడు. 

YouTuber Harsha Sai in Shamshabad Airport :

Youtuber Harsha Sai Gets Anticipatory bail in Harassment Case

Tags:   HARSHA SAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ