Advertisementt

పూర్తిగా తెంచేసుకున్నారా బాబుగారు..

Mon 04th Nov 2024 02:13 PM
chandrababu  పూర్తిగా తెంచేసుకున్నారా బాబుగారు..
Has the relationship been completely severed, Babu Garu పూర్తిగా తెంచేసుకున్నారా బాబుగారు..
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి ప్రచారం చేసిన సమయంలో చంద్రబాబు-బాలకృష్ణ లు ఎన్టీఆర్ ను అక్కున చేర్చుకున్నారు. ఎప్పడైతే ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నాడో అప్పుడే చంద్రబాబు, బాలయ్యలు ఎన్టీఆర్ కు దూరం జరిగారు. ఎన్టీఆర్ తో తత్సంబందాలు కొనసాగించిన సమయంలో చంద్రబాబు తనకి చుట్టమైన నార్నె శ్రీనివాస్ కుమర్తె లక్ష్మి ప్రణతితో ఎన్టీఆర్ ని ఇచ్చి వివాహము చేసారు. నందమూరి ఫ్యామిలీ, చంద్రబాబు అందరూ దగ్గరుండి మరీ ఎన్టీఆర్-ప్రణతి ల పెళ్లి జరిపించారు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా జరిగిపోవడం, యధాతధంగా బాలయ్య-చంద్రబాబు ఎన్టీఆర్ ని దూరం పెట్టడమూ జరిగిపోయాయి. అయితే తాజాగా నార్నె శ్రీనివాస్ తన కొడుకు నార్నె నితిన్ ఎంగేజ్మెంట్ చేసాడు. ఈ వేడుకలో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ మాత్రమే కనిపించారు కానీ చంద్రబాబు, బాలయ్య ఫ్యామిలీస్ కనిపించలేదు. 

మరి చంద్రబాబు నార్నె శ్రీనివాస్, ఎన్టీఆర్ తో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్నారా అనే టాక్ వినిపిస్తోంది. నార్నె శ్రీనివాస్ తన అల్లుడ్ని పక్కనపెట్టాక ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబు పై చేసిన కామెంట్స్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. 

ఇలాంటి సమయంలో కొడుకు నిశ్చితార్ధానికి చంద్రబాబుని శ్రీనివాస్ పిలవలేదా, ఆహ్వానం అందినా చంద్రబాబు అవాయిడ్ చేసారా.. ఇక్కడ నితిన్ నిశ్చితార్ధం జరిగిన సమయంలోనే చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో పారిశ్రామిక వేత్త సుధాకర్ చౌదరి కుమార్తె కేయూర వివాహానికి హాజరవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Has the relationship been completely severed, Babu Garu:

Chandrababu avoids Narne Nithin engagement

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ