Advertisementt

నితిన్ నిశ్చితార్థంలో తారక్ ఫ్యామిలీ సందడి

Sun 03rd Nov 2024 06:57 PM
jr ntr  నితిన్ నిశ్చితార్థంలో తారక్ ఫ్యామిలీ సందడి
NTR Family Cute Visuals at Narne Nithin Engagement నితిన్ నిశ్చితార్థంలో తారక్ ఫ్యామిలీ సందడి
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజాగా తన బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థంలో బావగారి హోదాలో చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నార్నె నితిన్ అంటే తెలియని వారుండరు. మొన్నటివరకు ఎన్టీఆర్ బావమరిది హోదానే. కానీ ఈ రోజు నార్నె నితిన్ హీరో. అతను నటించిన మ్యాడ్, ఆయ్ చిత్రాలు హిట్ అవడంతో నార్నె నితిన్ కు గుర్తింపు వచ్చింది. 

బావమరిది తన స్వశక్తితో ఎదగాలని ఎన్టీఆర్ పెద్దగా హెల్ప్ కూడా చెయ్యకుండానే నితిన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తమ్ముడు నిశ్చితార్థంలో లక్ష్మి ప్రణతి ఏంజెల్ లా రెడీ అయ్యి పెళ్లి కుమార్తెను డామినేట్ చేసింది. ఎన్టీఆర్ పిల్లలు భార్గవ్, అభయ్ లు అలాగే భార్య ప్రణతి లు నార్నె నితిన్ ఎంగేజ్మెంట్ లో  క్రీమ్ కలర్ థీమ్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. 

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల తో పాటుగా రిలేటివ్స్, స్నేహితులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌ అయన భార్య స్వాతి, హీరో వెంకటేశ్‌, నిర్మాత చినబాబు తదితరులు సందడి చేసారు. 

NTR Family Cute Visuals at Narne Nithin Engagement:

Jr NTR Along With Family Spotted at Hero Narne Nithin Engagement

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ