Advertisementt

సింగిల్ గానా.. నో అంటున్న సమంత

Sun 03rd Nov 2024 01:00 PM
samantha  సింగిల్ గానా..  నో అంటున్న సమంత
Whether single.. Samantha says no సింగిల్ గానా.. నో అంటున్న సమంత
Advertisement
Ads by CJ

సిటాడెల్ హనీ - బన్నీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత కి అక్కడి మీడియా నుంచి తరచుగా రెండో పెళ్లి విషయమై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కారణం నాగ చైతన్య ఈ డిసెంబర్ లో హీరోయిన్ శోభిత దూళిపాళ్లను వివాహం చేసుకోవడమే. ఆగస్టు 8 న నిశ్చితార్ధం చేసుకున్న చైతు-శోభిత ల పెళ్ళికి తేదీ నిశ్చయమైంది. ప్రస్తుతం వీరి పెళ్లి మ్యాటర్ ట్రెండ్ అవుతుంది.

అందుకే సమంత ను కూడా రెండో పెళ్లి చేసుకుంటారా అంటూ బాలీవుడ్ మీడియా ప్రశ్నిస్తుంది. ఒకసారి తాను ప్రేమించి, ఇష్టప‌డి పెళ్లి చేసుకున్నాననీ, కానీ ఇప్పుడు విడిపోయామనీ అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు, తనకు మ‌రో వ్యక్తి అవ‌స‌రం లేదనీ, ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నానని చెప్పిన సమంత ని మరోసారి ఆమెని రెండో పెళ్లి విషయమై కదిపారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సింగిల్‌గా ఉండటాన్ని ఇష్టపడతారా అంటూ సమంత ను ప్రశ్నించాడు సదరు యాంకర్.

దానికి సమంత నో(సింగిల్ గా ఉండేందుకు ఇష్టపడను) చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అంటే ఆమె కూడా లైఫ్ లో సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుందా, రెండో పెళ్ళికి సిద్ధమవుతోందా అంటూ నెటిజెన్స్ అప్పుడే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. 

Whether single.. Samantha says no:

Does Samantha Ruth Prabhu Love Being Single?

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ