Advertisementt

గేమ్ ఛేంజర్ ఆ సీక్వెన్స్ కేక పెట్టిస్తుందట ..

Sun 03rd Nov 2024 12:55 PM
game changer  గేమ్ ఛేంజర్ ఆ సీక్వెన్స్ కేక పెట్టిస్తుందట ..
That sequence screams Game Changer.. గేమ్ ఛేంజర్ ఆ సీక్వెన్స్ కేక పెట్టిస్తుందట ..
Advertisement
Ads by CJ

 

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 సంక్రాంతి స్పెషల్ గా విడుదలకు సిద్దమవుతుంది. మరో వారం రోజుల్లో అంటే నవంబర్ 09 గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ రాబోతుంది. దానికి సంబందించిన గేమ్ ఛేంజర్ పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ లుంగీలో మాస్ అవతార్ లో కనిపించడం మెగా అభిమానులకు కిక్ ఇచ్చింది. 

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఆత్రంగా ఉన్నారు. గేమ్ చెంజర్ విడుదలకు రెండు నెలల సమయమే ఉండడంతో గేమ్ ఛేంజర్ నుంచి రాబోయే అప్ డేట్స్ పై క్రేజ్ పెరిగిపోతుంది. తాజాగా గేమ్ చేంజర్లో ఓ సీక్వెన్స్ పై వస్తున్న వార్తలు సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. రీసెంట్ గా ట్రైన్ పట్టాల మధ్యలో రామ్ చరణ్ కూర్చుని ఉన్న పోస్టర్ రివీల్ చేసారు. 

అందుకు సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో కేక పెట్టిస్తుంది, అభిమానులైతే విజిల్స్ వేస్తూ రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. మొన్నామధ్యన చరణ్ హెలికాఫ్టర్ ముందు నించుని ఉన్న స్టిల్ ని రిలీజ్ చేసారు, దానికి కొనసాగింపే ఈ ఫైట్ సీక్వెన్స్.. అనడమే కాదు ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది తెలుస్తోంది. 

మరి ఇలాంటి వార్తలే మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంటాయి. ఇక సినిమా విడుదలవ్వబోయే ముందు ఇంకెన్ని క్రేజీ వార్తలు వినాల్సి ఉంటుందో అంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే ఎగ్జైట్ అవ్వడం మొదలు పెట్టేసారు.  

That sequence screams Game Changer..:

Game Changer update

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ