Advertisementt

విజయ్ తో డేటింగ్ రూమర్స్: త్రిష ఇండైరెక్ట్ పోస్ట్

Sun 03rd Nov 2024 11:27 AM
trisha  విజయ్ తో డేటింగ్ రూమర్స్: త్రిష ఇండైరెక్ట్ పోస్ట్
Trisha Krishnan shares a cryptic post విజయ్ తో డేటింగ్ రూమర్స్: త్రిష ఇండైరెక్ట్ పోస్ట్
Advertisement
Ads by CJ

40 ప్లస్ ఏజ్ లోను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన త్రిష కృష్ణన్.. ఈమధ్యన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో డేటింగ్ చేస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చేసి త్రిష తో పెళ్లికి సిద్దమవుతున్నాడనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. 

తాజాగా త్రిష ఈవార్తలపై ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. చాలామంది చేసే తప్పులను పట్టించుకునే తీరిక, ఓపిక నా దగ్గర లేదు. దానికి నా ఎనర్జీని వేస్ట్ చేసుకోను. ఒకవేళ ఎవరైనా నా గురించి చెత్త రాసినా, మాట్లాడినా దానికి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 

వారితో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. గొడవపడి డ్రామా క్రియేట్ చెయ్యడం అంతకన్నా ఇష్టం ఉండదు, అలాంటి వారికి దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉండడమే ఉత్తమం. నీ లైఫ్ లో నీకు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారని ఎదురు చూడకు, ఒకరి నుంచి నీవు ఏమీ ఆశించకు. నీ జీవితానికి ఏది బావుంటుందో, ఏం కావాలో దానిపై దృష్టి పెట్టుకో. ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకు అంటూ త్రిష చేసిన ట్వీట్ తనపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఉంది అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

Trisha Krishnan shares a cryptic post :

Trisha Reply About Dating With Thalapathy Vijay Controversy

Tags:   TRISHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ