Advertisementt

బాలయ్యను ఇరికిద్దామనుకుని బోర్లాపడిన కరణ్

Sat 02nd Nov 2024 10:20 PM
balakrishna  బాలయ్యను ఇరికిద్దామనుకుని బోర్లాపడిన కరణ్
Karan Johar Funny Chat with Balakrishna బాలయ్యను ఇరికిద్దామనుకుని బోర్లాపడిన కరణ్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణను బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తక్కువ అంచనా వేసి బొక్క బోర్లా పడ్డారు. ఈమధ్యన టాక్ షోలో మాటల్లో బాగా రాటు తేలిపోయిన బాలయ్య ను ఆయనకు సమకాలీకులైన చిరంజీవి అంటే ఇష్టమా, లేదంటే నాగార్జున అంటే ఇష్టమా, కాదు వెంకటేష్ అంటే ఇష్టమా అని కరణ్ జోహార్ అడిగారు. 

దానికి బాలకృష్ణ ఏం సమాధానమిస్తారో అని అందరూ వెయిట్ చేసే లోపులోనే.. బాలయ్య కరణ్ జోహార్ కు షాకిచ్చారు. మీకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఎవరంటే ఇష్టం అంటూ కరణ్ జోహార్ నే ఇరుకున పెడుతూ వేసిన కౌంటర్ కు అక్కడున్న వారంతా నోరు తెరిచారు. కరణ్ జోహార్ అయితే అవాక్కయ్యారు. 

ఇదంతా ఈమధ్యన అబూ దాబిలో జరిగిన నెక్సా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుకలో జరిగింది. ఈ ఈవెంట్ లోనే బాలకృష్ణకు గోల్డెన్ లెగసి అవార్డు అందించారు. ఈ స్టేజ్ పైనే కరణ్ జోహార్ బాలయ్యను సరదాగా ఆటపట్టిద్దామనుకుని ఆయన బోర్లా పడిన వీడియో క్లిప్పింగ్స్ వైరల్ గా మారాయి. 

Karan Johar Funny Chat with Balakrishna:

Balakrishna Fun Interaction with Karan Johar Goes Viral

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ