Advertisementt

BB 8: ఈ వారం ఊహించిన ఎలిమినేషనే

Sat 02nd Nov 2024 08:59 PM
nayani pavani  BB 8: ఈ వారం ఊహించిన ఎలిమినేషనే
BB 8: Expected elimination this week BB 8: ఈ వారం ఊహించిన ఎలిమినేషనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఊహించిన ఎలిమినేషనే జరిగింది. ఈ వారం ప్రేరణ, యష్మి, నిఖిల్, గౌతమ్ లకు క్లాస్ పీకిన నాగార్జున తర్వాత ఆటపాటలతో వాళ్ళను కూల్ చేసారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో యష్మి, గౌతమ్, తర్వాత టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ఉన్నారు. 

ఈ వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి యష్మి నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. తర్వాత గౌతమ్ రెండో స్థానంలో ఓట్లు కొల్లగొట్టాడు. టేస్టీ తేజ కూడా బాగానే ఓట్లు తెచ్చుకున్నాడు. ఇక హౌస్ లో పెద్దగా యాక్టీవ్ గా కనిపించని హరితేజ, నయని పావని మొదటి నుంచి డేంజర్ జోన్ లోనే కనిపించారు. 

గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన నయని పావని అదృష్టవశాత్తు ఓ వారం సేవ్ అయ్యింది, ఈ వారం మాత్రం ఎలిమినేట్ అయ్యి ఇంటి కెళ్ళిపోయింది. ముందు నుంచి ఆటలో కన్నా ఎక్కువగా ఏడుపు పై ఫోకస్ పెట్టిన నయని ని బుల్లితెర ప్రేక్షకులు ఈ వారం ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. 

ఈ వారం ముందుగా టేస్టీ తేజ సేవ్ అవ్వగా, తర్వాత ఒక్కోక్కరిగా యష్మి, గౌతమ్ సేవ్ అయ్యారు. ఆ తర్వాత హరితేజ-నయని డేంజర్ జోన్ లో నిలబడగా.. ఈ వారం అందరూ ఊహించినట్టుగానే నయని పావని ఎలిమినేట్ అయ్యింది. 

BB 8: Expected elimination this week:

Nayani Pavani Eliminated From Bigg Boss Telugu 8 

Tags:   NAYANI PAVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ