కన్నడ హీరో దర్శన్ జైలులో ఉన్న కొద్ధి నెలల తర్వాత ఎట్టకేలకు కండిషన్ బెయిల్ పై బయటికి వచ్ఛాడు. కేవలం ఆరువారాల బెయిల్ పై దర్శన్ బయటికి రాగా.. ఆయన బెంగుళూరు లోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. రేణుక స్వామి హత్య కేసులో A 2 నిందితుడిగా జైలులో ఉన్న దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ లకు కోర్టు బెయిల్ ఇవ్వకుండా విచారణ చేపట్టింది.
అయితే దర్శన్ అనారోగ్య కారణాలతో కర్ణాటక హై కోర్టుని ఆశ్రయించగా.. కర్ణాటక హై కోర్టు దర్శన్ కు ఆరువారాల బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చిన దర్శన్ బెంగుళూరులోని ప్రవేట్ ఆసుపత్రిలో చేరినట్లుగా ఆయన లాయర్ తెలియజేసారు.
దర్శన్ కొద్దిరోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. దానికి సర్జరీ అవసరమని డాక్టర్స్ సూచించడంతో దర్శన్ కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. మరోపక్క ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ కూడా బెయిల్ పిటిషన్ వెయ్యగా, కోర్టు బెయిల్ విచారణని వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పవిత్రకు బెయిల్ రాకపోవచ్చని, రేణుక స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ A1 నిందితురాలిగా ఉంది.