Advertisementt

దివాళి చిత్రాల ఓటీటీ డీటెయిల్స్

Sat 02nd Nov 2024 01:49 PM
diwali  దివాళి చిత్రాల ఓటీటీ డీటెయిల్స్
Diwali Movies Ott Details దివాళి చిత్రాల ఓటీటీ డీటెయిల్స్
Advertisement
Ads by CJ

దీపావళి రోజు బాక్సాఫీసు వద్ద పోటీపడిన లక్కీ భాస్కర్, , అమరన్, బఘీర చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా ప్రేక్షకులకు నచ్చేసాయి. అన్నిటిలో లక్కీ భాస్కర్ కు బ్లాక్ బస్టర్ రివ్యూస్, పబ్లిక్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కిరణ్ అబ్బవరం కూడా సూపర్ హిట్ టాక్ తో రోజు రోజుకి థియేటర్స్ పెంచుకుంటుంది.

ఇక తమిళం నుంచి వచ్చిన అమరన్ కి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. క్రిటిక్స్ యునానమస్ గా 3 రేటింగ్స్ తో విన్నర్ ని చేసేసారు. ఈ మూడు సినిమాల మధ్యన భగీర ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఫుల్ గా ఇంప్రెస్స్ చేసేశాయి.

మరి థియేటర్స్ లో అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రాలు మంచి హిట్ కాగా ఇపుడు ఈ చిత్రాలు ఏయే ఓటీటీ ల నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి అనే విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉత్సుకత పెరిగింది.

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి కలయికలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ ని పాపులర్ స్ట్రీమింగ్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అలాగే కిరణ్ అబ్బవరం సినిమాని తెలుగు స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకుంది. ఇక శివ కార్తికేయన్-సాయి పల్లవి ల అమరన్ ని కూడా నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. మరి డిసెంబర్ మొదటి వారంలో ఈ మూడు హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ కి రావొచ్చు. 

Diwali Movies Ott Details:

Diwali 2024 New Releases: OTT Rights details

Tags:   DIWALI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ