Advertisementt

BB 8: మొన్న తప్పించుకుంది.. కానీ ఈసారి..

Fri 01st Nov 2024 12:05 PM
nayani pavani  BB 8: మొన్న తప్పించుకుంది.. కానీ ఈసారి..
BB8: Nayani Pavani in danger zone BB 8: మొన్న తప్పించుకుంది.. కానీ ఈసారి..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లో నిఖిల్-యష్మిల ఫ్రెండ్ షిప్ దూరమైనట్లే అనిపించింది. వాటర్ టాస్క్ లో నిఖిల్-యష్మి ల మధ్యన పెద్దగొడవ అవడం, ఏడవడం ఆ తరవాత నీ టీమ్ కోసం నువ్వు నా టీమ్ కోసం నేను ఆడుతున్నా అంటూ ఎడ మొహం పెడ మొహంగా మారిపోయారు. ఇక ఈ తొమ్మిదో వారం నామినేషన్స్ లో గౌతమ్ కృష్ణ, యష్మీ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ లు ఉన్నారు. 

ఓటింగ్ లైన్ ఓపెన్ అయినప్పటి నుంచే యష్మి ఓటింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో కనిపిస్తుంది. మొదటిరోజు నుంచి ఈరోజు వరకు యష్మి డామినేషన్ కనిపించింది. ఆ తర్వాత స్థానంలో గౌతమ్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజలు కొనసాగుతున్నారు. చివరిగా డేంజర్ జోన్ లో నయని పావని నిలిచింది. 

అయితే గత వారంఎలిమినేషన్ ను తృటిలో తప్పించుకున్న నయని పావని ఈ వారం ఎలిమినేట్ అవడం పక్కాగా కనిపిస్తుంది. గత వారం నయని పావని వెళ్ళాల్సింది, ఆ సమయంలో మెహబూబ్ ఎలిమినేట్ అవడం అందరికి షాక్ కి గురి చేసింది. అయితే టాస్క్ ల్లో ఆడడం కన్నా ఎక్కువగా ఏడుపు, గొడవలు పడడం మీదే ఫోకస్ పెట్టిన నయని ని ఈ వారం ప్రేక్షకులు ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నారు. 

BB8: Nayani Pavani in danger zone:

Bigg Boss Telugu 8 Voting Results Week 9: Nayani Pavani in danger zone

Tags:   NAYANI PAVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ