నాగ చైతన్య తో నిశ్చితార్ధం చేసుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అప్పుడే అక్కినేని ఇంట అడుగుపెట్టేసింది. ANR అవార్డు వేడుకలోనే అక్కినేని కుటంబం మధ్యన శోభిత దూళిపాళ్ల తెగ హైలెట్ అయ్యింది. అక్కినేని కోడలి హోదాలో శోభిత దూళిపాళ్ల ఆ ఈవెంట్ లో కనిపించింది. నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ల వెడ్డింగ్ డేట్ డిసెంబర్ 6 అని అంటున్నారు.
శోభిత దూళిపాళ్ల నాగ చైతన్య ని వివాహమాడకముందే నాగ్ ఇంట కోడలి హోదాలో మొదటి దీపావళి ని సెలెబ్రేట్ చేసుకుందా అనేలా ఓ పిక్ బయటికి వచ్చింది. నాగార్జున-అమల, నాగ చైతన్య, అఖిల్, శోభిత దూళిపాళ్ల కలిసి ఉన్న పిక్ బయటికి రాగానే అందరూ అక్కినేని ఇంట శోభిత మొదటి దివాళి సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ పిక్ లో శోభిత దూళిపాళ్ల క్రీమ్ కలర్ శారీ లో స్పెషల్ గా మెరిసిపోయింది.