నాగ చైతన్య-వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ తండేల్ సంక్రాంతి కి విడుదల చెయ్యాలా లేదంటే అల్లు అరవింద్ గారు, వెంకీ చిత్రాల కోసం ఆ తర్వాత విడుదల చేయాలా అనే విషయంలో మేకర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాగ చైతన్య- చందు మొండేటిల కాంబోలో తెరకెక్కిన తండేల్ పై విపరీతమైన హైప్ ఉంది.
ఇక ఈచిత్రం తర్వాత నాగ చైతన్య ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడనే విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టే కనబడుతుంది. మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చైతు రెండోసారి నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా టాక్ వినబడుతుంది. ప్రేమ కథలను హ్యాండిల్ చెయ్యడంలో శివ నిర్వాణ ఘటికుడు.
మైత్రీ మూవీస్ నిర్మించబోయే ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే బావుంటుంది అని శివ నిర్వాణ భావిస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ నాగ చైతన్య ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.