యూట్యూబర్ హర్ష సాయి పై బిగ్ బాస్ ఫేమ్, నటి అయిన యువతి తనని మోసం చేసి రెండు కోట్లు తీసుకుని లైంగికంగా వేధించాడు అంటూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. మెగా అనే సినిమా మూవీ రైట్స్ విషయంలో విభేదాలు తలెత్తడంతో, రెండు కోట్లు మోసం చేసాడు అంటూ హర్ష సాయి పై సదరు నటి కేసు పెట్టింది.
తానేమి నేరం చెయ్యలేదు, న్యాయపోరాటం చేస్తా అంటూ బిల్డప్ ఇచ్చిన హర్ష సాయి ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. పోలీసులు హర్ష సాయిని పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులు జారీ చేసినా హర్ష సాయి మాత్రం పోలీసులకు దొరక్కుండా హై కోర్టులో ముందస్తు బెయిల్ కు అప్లై చేసాడు.
తాజాగా హర్ష సాయి కి హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో తనపై మోపిన అభియోగాలన్నీ అబద్ధాలని హర్ష సాయి లాయర్ కోర్టులో వాదించగా.. విచారణ తర్వాత హై కోర్టు హర్ష సాయి కి బెయిల్ మంజూరు చేసింది. అయితే హై కోర్టులో తనకు న్యాయం జరక్కపోతే తాను హర్ష సాయి పై సుప్రీం కోర్టుకు వెళతానని ఆ నటి చెబుతుంది.