Advertisement

సీన్ రివర్స్.. కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్చీఫ్!

Wed 30th Oct 2024 03:56 PM
brs  సీన్ రివర్స్.. కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్చీఫ్!
Congress MLAs kerchief in the car! సీన్ రివర్స్.. కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్చీఫ్!
Advertisement

కారులో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్చీఫ్!

అవును.. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఫాం హౌస్ వేదికగా ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐతే వారి రాకను బాస్ సున్నితంగానే తిరస్కరించారట. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేల చేరికలు అక్కర్లేదని సారు లైట్ తీసుకున్నారట. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు..? కారు పార్టీ నుంచి వెళ్లి హస్తం గుర్తుపై గెలిచిన వాళ్ళు తిరిగి రావాలని భావిస్తున్నారా..? లేదంటే కట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? అనేది ఇంత వరకూ తెలియరాలేదు.

అసలేం జరిగింది?

కేసీఆర్ పదేళ్ళ పాలనపై వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టారు. ప్రభుత్వంలోకి వచ్చి నెల రోజులు తక్కువ ఏడాది అయ్యింది. ఇంతవరకు ఈ వర్గానికి రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఏమీ ఒరిగింది లేదు అన్నది ఆ ఐదుగురు ఎమ్మెల్యేల భావన. దీనికి తోడు హైడ్రా, మూసీ సుందరీకరణ, రైతు రుణమాఫీ, సూపర్ సిక్స్ అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో ప్రజల్లో కావలసిన దానికంటే ఎక్కువగానే చెడ్డ పేరు వచ్చేసింది. పార్టీపై జనాలు కన్నెర్ర చేస్తున్న పరిస్థితుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా కారులో చోటు కోసం కర్చీఫ్ వేశారట. భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే అని ఫిక్స్ అయిన ఆ ఐదుగురు ఈ నిర్ణయానికి వచ్చారట.

పైసా ప్రయోజనం లేదట

కాంగ్రెస్ తరపున గెలిచిన తమకు, పార్టీ అధికారంలో ఉన్నా పైసా కూడా ప్రయోజనం లేకుండా పోయిందట. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి కావడం, సీనియర్ల నుంచి సహాయనిరాకరణ కనిపిస్తూ ఉండటం, ఇదే అదనుగా తీసుకొని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కారు పార్టీ పోరాటాలు చేయడంతో జనం అక్కున చేర్చుకుంటున్నారు. ఈ మొత్తం మీద హైడ్రా, మూసీ సుందరీకరణ విషయంలో ప్రజలను ఒప్పించడం, మెప్పించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలం అయ్యింది. దీంతో వేలాది మంది నిరాశ్రయుల్యారు.. ఆ ఆర్తనాదాలు, వారి బాధలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. హైడ్రా తిన్నగా హైదరాబాద్ మహానగరం నుంచి జిల్లాలకు కూడా పాకుతూ ఉండటంతో ఇక రానున్న ఎన్నికల్లో హస్తం కష్టమేనని భావించి కాంగ్రెస్ పార్టీని వీడి కారు పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

కనీస మర్యాద!

ఇవన్నీ ఒక ఎత్తయితే మంత్రి వర్గంలో, విస్తరణలో చోటు లేకపోవడం.. చోటు సంగతి దేవుడెరుగు కనీసం ఎమ్మెల్యేలుగా గుర్తించక పోవడంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటి? ఎందుకు ఉండాలి అని ఆలోచించి ఐదుగురు ఈ నిర్ణయానికి వచ్చారట. రేవంత్ Vs సీనియర్లు అంటూ రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో జాతీయ మీడియాలో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి సంచలనం కథనం రావడం గమనార్హం. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకమునుపే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

Congress MLAs kerchief in the car!:

Five Congress MLAs Kerchief into BRS!

Tags:   BRS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement