నాగ చైతన్య-హీరోయిన్ శోభిత దూళిపాళ్ళ రెండేళ్ళుగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆగష్టు 8 న అక్కినేని-దూళిపాళ్ల ఫ్యామిలీస్ మధ్యన సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అనే ఆతృతలో అక్కి నేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం జరిగిన ANR అవార్డుల వేడుకలో శోభిత దూళిపాళ్ల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దానితో వీళ్ళ పెళ్లి తేదీపై మరోసారి వార్తలు మొదలయ్యాయి. ఇప్పటికే శోభిత ఇంట పెళ్లి పనులు కూడా పసుపు దంచే వేడుకతో మొదలైపోయాయి. తాజాగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.
డిసెంబర్ 4 న నాగ చైతన్య-శోభితల వివాహానికి ముహుర్తాన్ని ఇరుకుటుంబాల వారు నిశ్చయించారని.. డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే ఈ పెళ్లికి రాజస్థాన్ వేదిక కానుంది అనే టాక్ వినిపిస్తుంది. ఈ పెళ్ళికి ఇండస్ట్రీ నుంచి దగ్గరి వారికి మత్రమే ఆహ్వానాలు అందుతాయని, చాలా తక్కుమంది సన్నిహితుల నడుమ చైతు-శోభితల వివాహాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.