Advertisement

దివాళి కి కూడా మెగా ఫ్యాన్స్ కు నిరాశే..

Wed 30th Oct 2024 02:31 PM
game changer  దివాళి కి కూడా మెగా ఫ్యాన్స్ కు నిరాశే..
Mega fans are disappointed even for Diwali! దివాళి కి కూడా మెగా ఫ్యాన్స్ కు నిరాశే..
Advertisement

 

గేమ్ ఛేంజర్ సినిమా అప్ డేట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు డిజప్పాయింట్ అవుతూనే ఉన్నారు. రిలీజ్ డేట్ విషయంలో ఊరించి ఊరించి డిసెంబెర్ 20 నుంచి జనవరి 10 సంక్రాంతికి మార్చిన మేకర్స్ అప్ డేట్స్ విషయంలోను మెగా అభిమానులకు విషమ పరీక్ష పెడుతున్నారు. పండగలు పబ్బాలు వస్తున్నాయి వెళ్లిపోతున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ మాత్రం ఇవ్వరు,

దసరా వచ్చింది వెళ్ళింది, రేపు దీపావళి. దీపావళికైనా గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని ఆశపడిన మెగా అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఫ్యాన్స్ దీపావ‌ళికి గేమ్ ఛేంజ‌ర్ నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఆశించారు, ఆ విషయంలో మేకర్స్ నుంచి అలికిడి లేదు. గేమ్ ఛేంజర్ విడుదలకు 75రోజులు ఉంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు.

ఇంకేంటి దివాళి కి ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ వదులుతారని మెగా ఫ్యాన్స్ భావించారు. కానీ అలాంటిదేం లేదు. తాజా సమాచారం ప్రకారం న‌వంబ‌రు 4న గేమ్ ఛేంజర్ టీజ‌ర్‌ని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ను కూడా భారీ ఈవెంట్ తో చెయ్యాలని అనుకుంటున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. సో అప్పటివరకు మెగా ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాల్సిందే. 

Mega fans are disappointed even for Diwali!:

Mega fans are disappointed regarding Game Changer movie updates

Tags:   GAME CHANGER
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement