కన్నడ హీరో దర్శన్ కు ఫైనల్ గా ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్న దర్శన్ కు ఎట్టకేలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నోసార్లు దర్శన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేసిన కోర్టు వైద్య చికిత్సల కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ వేసిన పిటిషన్ ని పరిశీలించి కోర్టు సానుకూలంగా తీర్పు చెప్పింది.
దర్శన్ ట్రీట్‌మెంట్ కోసం ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానితో దర్శన్ అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. రేణుక స్వామిని హత్య చేయించిన నేరంలో దర్శన్ ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ ఇంకా కొంతమంది నేరస్తులు కొద్దినెలలుగా జైలులోనే ఉన్నారు.
ఈమద్యలో రేణుక స్వామి భార్య ప్రసవించడం, దర్శన్ కు జైలులో రాచ మర్యాదలు జరుగుతున్నాయంటూ బెంగుళూరు జైలు నుంచి దర్శన్ ను బళ్లారి జైలుకు షిఫ్ట్ చెయ్యడం, అక్కడ ఉండలేక దర్శన్ రకరకాలుగా పోలీసులను వేడుకోవడం అన్ని అందరికి తెలిసిన విషయమే.